ATP: ప్రతి విద్యార్థి మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలు ఆరోగ్యానికి హానికరమని గుత్తి ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ ఉమాదేవి పేర్కొన్నారు. ఇవాళ పెద్దవడుగూరు మండల కేంద్రంలోని గేట్స్ కళాశాలలో డ్రగ్స్ నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాల గురించి వివరించారు.