ప్రకాశం: వెలిగండ్ల ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్న అంగన్వాడీ కార్య కర్తలకు ప్రభుత్వం మంజూరు చేసిన 5జీ ఫోన్లను ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి స్థానిక ప్రాజెక్టు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అంగన్వాడీ సేవలుసమర్థవంతంగా అందించాలని సూచించారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.