AP: ప్రధాని మోదీ కోరితే స్వచ్ఛ భారత్‌పై నివేదిక ఇచ్చానని సీఎం చంద్రబాబు అన్నారు. గ్రీన్ అంబాసిడర్లుగా ఉన్న పారిశుధ్య కార్మికులకు అభినందనలు తెలిపారు. ఉత్తమ పారిశుధ్య కార్మికులకు అవార్డులు ఇస్తున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వం వదిలేసిన 86 లక్షల టన్నుల చెత్త తొలగించామన్నారు. ఇంట్లో చెత్త ఊడ్చి రోడ్డుపై వేయడం మానేయాలని సూచించారు.