AP: కొత్త సంవత్సరం, సంక్రాంతి పండగల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించాలనే లక్ష్యంతో, రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులను మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకే అందించనుంది. ఈ చర్యతో పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరట లభించనుంది. ముఖ్యంగా గోధుమ పిండి, జొన్నలు, రాగులు వంటి ధాన్యాలు అందుబాటులో ఉండనున్నాయి.