NTR: కొండపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి కృషి చేస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు వెల్లడించారు. గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో కొండపల్లి మున్సిపల్ కౌన్సిలర్లతో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు.