W.G: నరసాపురం మండలం యర్రంశెట్టివారి పాలెం గ్రామ సచివాలయ ప్రాంగణంలో శుక్రవారం పశువైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ ఇంఛార్జ్ ఏడీఏ డా. ఇంజేటి సురేంద్ర కుమార్ తెలిపారు. కావున పాడి రైతులు ఈ శిబిరాన్ని సద్వినియోగ పర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నాయకర్ ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా లేగ దూడలు ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు.