VZM: సిమ్స్ మెమోరియల్ బాప్టిస్టు చర్చిలో సంఘమిత్ర ఆర్ఎస్ జాన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే అదితి గజపతి రాజు పాల్గొన్నారు. కొత్త ఏవియేషన్ ఎడ్యూసిటీ ఈ క్రిస్మస్ నెలలో ఏర్పాటు చేయడం మనకే గర్వ కారణమన్నారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా పాస్టర్ ప్రభాకర్ దైవ సందేశాన్ని తెలపగా, క్వయర్ సంగీతాన్ని అందజేశారు.