PDPL: కమాన్పూర్ మండలంలోని పెంచికల్ పేట్ గ్రామానికి చెందిన పల్లె లక్ష్మి అనే మహిళ కోతి దాడిలో తీవ్రంగా గాయపడింది. ఆ మహిళను కమాన్ పూర్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకరాగా ప్రథమ చికిత్స అనంతరం గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించినట్లు సమాచారం. ఇప్పటికే పెంచికల్ పేట్ గ్రామంలో సుమారు 50 మంది వరకు కోతుల దాడిలో గాయపడినట్లు సమాచారం.