CTR: రెండు స్కూటర్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు గాయపడ్డ ఘటన చౌడేపల్లి మండలంలో చోటుచేసుకుంది. చౌడేపల్లి తిరుపతి ప్రధాన రహదారిలో ఆమెని గుట్ట సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద ఎదురుగా వస్తున్న 2 స్కూటర్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చౌడేపల్లికి చెందిన మోహిత్ (25) పుంగనూరు మండలం బండ్లపల్లికి చెందిన గిరి (55)లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.