ADB: బజార్హత్నూర్ మండలంలోని దేగామ గ్రామస్థులు శనివారం ఆర్టీసీ డివిజనల్ మేనేజర్ (డీఎం)ను కలిసి వినతిపత్రం సమర్పించారు. దేగామ నుంచి మోర్ఖండి, మోర్ఖండి నుంచి ఇచ్చోడ, ఇచ్చోడ నుంచి టెంబి వయా దేగామ మార్గాల్లో బస్సులను నడపాలని వారు కోరారు. ఈ ప్రాంతాలు దూరంగా ఉండటంతో బస్సు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.