EG: ఔరంగాబాద్ ఇసుక ర్యాంపులో శుక్రవారం మూడు సెల్ఫోన్లు దొంగిలించిన నిందితుడిని స్థానికులు పట్టుకున్నారు. వాడపల్లికి చెందిన పోలుమాటి సురేష్, అక్కడ నిద్రిస్తున్న యూపీకి చెందిన ఇసుక కార్మికుల ఫోన్లు చోరీ చేసి పారిపోతుండగా ప్రజలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పాకా శ్యామ్ కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ పి.విశ్వం తెలిపారు.