అన్నమయ్య: రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసినట్లు టీడీపీ రూరల్ మండలాధ్యక్షుడు మేడికొండ రవికుమార్ నాయుడు తెలిపారు. శుక్రవారం మంగళగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వినతిపత్రం అందజేశారన్నారు. వినతిపత్రాన్ని స్వీకరించి, అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారని పేర్కొన్నారు.