WGL: వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో సర్పంచ్‌గా రాయపురం రమ్య విజయం సాధించగా, మాజీ ఎమ్మెల్యేలు కొండేటి శ్రీధర్ , రాజేశ్వరరావు శుక్రవారం ఆమెను స్వయంగా కలిసి అభినందించారు. చదువుకున్న ఎస్టీ మహిళగా అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయాలనే రమ్య సంకల్పాన్ని ఆయన ప్రశంసించారు. ఈ విజయానికి సహకరించిన స్థానిక నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.