W.G: భీమవరం కలెక్టరేట్లో శుక్రవారం జాతీయ వినియోగదారుల దినోత్సవం సంబరాలు 2025 ఏర్పాట్లపై జిల్లా జాయింట్ కలెక్టర్ టీ రాహుల్ కుమార్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. డిసెంబర్ 18 నుంచి 24వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలో వినియోగదారుల హక్కులపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు.