ADB: జైనథ్ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా జరిగేలా చూడాలని, ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. శుక్రవారం మండలంలోని సమస్యాత్మక ప్రాంతమైన లక్ష్మీపూర్ గ్రామాన్ని సందర్శించి, ప్రజలకు పలు సూచనలు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలని, ఎవరిని బలవంతం చేయరాదని, పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్లు, 200 మీటర్ల నియమాలు పాటించాలన్నారు.