ADB: మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘనలో 15 కేసులు నమోదైనట్లు SP అఖిల్ మహాజన్ తెలిపారు. ఉట్నూర్, నార్నూర్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్లలో మొత్తం 50 మంది వ్యక్తులపై 15 కేసులు నమోదు చేశామన్నారు. రెండు రోజుల్లో 15 నిబంధనల ఉల్లంఘన కేసులు, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించిన 5 బృందాలపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.