కరీంనగర్ ఎన్నికల అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు, అంతకంటే ఎక్కువ దశల్లో పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించిన సిబ్బందికి పోలింగ్ మరుసటి రోజు ‘ఆన్ డ్యూటీ’ సౌకర్యం కల్పించింది. 11, 14 తేదీల్లో విధులు నిర్వహించిన వారికి 15న, 14, 17న నిర్వహించిన వారికి 18న ఈ సౌకర్యం వర్తిస్తుంది. మూడు దశల్లో పాల్గొన్న వారికి రెండు రోజులు ‘ఆన్ డ్యూటీ’కి అర్హత ఉంటుంది.