ప్రకాశం: వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు నిబంధనలు పాటించాలని కనిగిరి డీఎస్పీ సాయి యశ్వంత్ ఈశ్వర్ అన్నారు. శుక్రవారం కనిగిరి పట్టణంలోని హైవే రోడ్డు నందు వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని వారి చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.