కోనసీమ: మహిళలకు కూటమి ప్రభుత్వం వివిధ రకాల సంక్షేమ పథకాల అమలు చేస్తుందని కూటమి సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం అన్నారు. కె.గంగవరం మండలం సత్యవాడలో శుక్రవారం పీఎం ఉజ్వల ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. మహిళల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.