ADB: జిల్లాలోని రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు 14న నిర్వహించనున్న నేపథ్యంలో ఎనిమిది మండలాల్లో నిషేధాజ్ఞలు అమలు అవుతాయని కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం తెలియజేశారు. ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల నిబంధనలు గౌరవించి ప్రజలు సహకరించాలని కలెక్టర్ ప్రజలను కోరారు.