ప్రకాశం: ఒంగోలు రిమ్స్ వైద్య శాల అభివృద్ధికి సుమారు రూ. 10 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కలెక్టర్ రాజబాబు వెల్లడించారు. రిమ్స్ ఆసుపత్రిని ఆయన శుక్రవారం సందర్శించారు. రోగులకు అందించాల్సిన వైద్య సేవలపై ఆరా తీశారు. రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు.