CTR: పుంగనూరు పట్టణం BMS క్లబ్ ఆవరణంలో ఈనెల 14న ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ జిల్లా ఛైర్మన్ డాక్టర్ శివ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఈ శిబిరం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతుందని చెప్పారు. కంటి సమస్యలు ఉన్నవారు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.