కేంద్ర మాజీమంత్రి శివరాజ్ పాటిల్ మృతి పట్ల ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన ఎమ్మెల్యే నుంచి లోక్సభ స్పీకర్ వరకు ఎన్నో పదవులు చేపట్టిన గొప్ప నాయకుడని కొనియాడారు. ‘కొద్ది నెలల క్రితమే ఆయన మా ఇంటికి వచ్చారు.. అదే చివరి కలయిక’ అని మోదీ గుర్తుచేసుకున్నారు. ప్రజాసేవ పట్ల ఆయనకు ఎంతో తపన ఉండేదని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కుటుంబానికి సంతాపం తెలిపారు.