BDK: పాల్వంచ మండలంలో గ్రామపంచాయితీ సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం. రఘురాం రెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ నాగా సీతారాములు ఇవాళ విస్తృత ప్రచారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థులకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.