VZM: డెంకాడ మండలం, కొండ్రాజుపేట గ్రామాభివృద్ధి తన బాధ్యత అని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి అన్నారు. గ్రామంలో నిర్వహించిన ‘మన ప్రజలతో మన ఎమ్మెల్యే’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. త్రాగు నీరు, అర్హులైన పేదలకు గృహ స్థలాల మంజూరు చేయాలని, మౌలిక వసతుల కల్పించాలని కోరారు. సమస్యలన్నింటినీ పూర్తి స్థాయిలో* పరిష్కరిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.