AKP: నర్సీపట్నం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇవాళ ఉదయం ధనుర్మాస పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ తాడికొండ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈనెల 16వ తారీకు నుంచి జనవరి 14 వరకు ధనుర్మాస మాస ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జనవరి 14న శ్రీ గోదాదేవి కళ్యాణం ఉంటుందన్నారు.