VZM:పూసపాటిరేగ(M) చోడమ్మ అగ్రహారం వద్ద నిలిపిన ప్రైవేట్ బస్సులో బుధవారం రాత్రి భారీ చోరీ జరిగింది. శ్రీకాకుళం నుంచి విజయవాడకు వెళ్తున్న జామి చంద్రశేఖర్, వినోద్ దగ్గర ఉన్న రెండు బ్యాగుల్లోని రూ. 69 లక్షలు దుండగులు ఎత్తుకుపోయారని బాధితులు స్థానిక PSలో నిన్న ఫిర్యాదు చేశారు. భోజన విరామం కోసం బస్సు ఆగిన సమయంలో బయటికి వెళ్లగా చోరీ జరిగినట్లు తెలిపారు.