మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనుల కారణంగా.. నేటి నుంచి ఒకటో నంబర్ ప్లాట్‌ఫాం అందుబాటులో ఉండదని రైల్వే అధికారులు తెలిపారు. పాత భవనం తొలగింపు, లూప్లైన్ల విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రైల్వే ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి, తమ రైళ్లు రెండు, మూడో ప్లాట్‌ఫామ్‌లపై మాత్రమే ఆగుతాయని పేర్కొన్నారు.