టీమిండియా మాజీ ఆల్ రౌండర్, ప్రపంచ కప్ హీరో యువరాజ్ సింగ్ పుట్టినరోజు నేడు. ‘సిక్సర్ల కింగ్’గా, పోరాట యోధుడిగా అభిమానుల గుండెల్లో నిలిచాడు. 2007 టీ20 ప్రపంచ కప్లో ఆరు సిక్సర్లు, 2011 వన్డే ప్రపంచ కప్లో మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అతడి కెరీర్ మైలురాళ్లు. క్యాన్సర్తో పోరాడి గెలిచి, ఎందరికో ఆదర్శంగా నిలిచిన ధీరుడు యువీ.