అన్నమయ్య: జిల్లాలో రబీ సీజన్‌కు సరిపడా యూరియా ఎరువులు అందుబాటులో ఉన్నాయని గురువారం కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. జిల్లాకు అవసరమైన 6124 మెట్రిక్ టన్నులకు గాను 6250 మెట్రిక్ టన్నులు నిల్వ చేశామని చెప్పారు. అధిక ధరలు వసూలు చేయడం, కృత్రిమ కొరత సృష్టించడంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు నానో యూరియా, నానో DAP వినియోగించాలని సూచించారు.