అస్సాం (Assam Forest) అటవీ ప్రాంతంలో ఏనుగులు ఎక్కువగా నివసిస్తుంటాయి. ఎందుకంటే వాటిని అనువైన వాతావారణం, కొండలు, చెట్లూ చేమలు అక్కడ ఎక్కువ. అయితే నాగరికత జీవనంలో రైలు ప్రవేశించినప్పుడు అడవుల మధ్యనుంచి రైళ్లు వెళ్లడం మామూలైంది. అడవుల గూండా వేసిన రైల్వేట్రాక్ ను దాటడంలో భాగంగా అడవి జంతువులు రైలుకు ఢీకొని చనిపోతుంటాయి. అందులో ఏనుగులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఏనుగులు లాంటి భారీ జంతువులు రైలు ట్రాక్ ను దాటుకుని వెళ్తుండగా ప్రమాదం సంభవించి వాటి ప్రాణం గాలిలో కలిసిపోయేవి. రైలు వేగానికి ఏనుగులు త్వరగా ట్రాక్ ను దాటలేకపోయేసరికి ప్రమాదం బారిన పడేవి. వాటి మరణాలను తగ్గించడానికి, అసలు ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు అధికారులు పలు చర్యలు తీసుకున్నప్పటికీ లాభం లేకుండా పోయింది. తాజాగా ఓ ఫారెస్ట్ ఆఫీసర్ సరికొత్త ఆలోచనతో వచ్చాడు.
ఐఎఫ్ఎస్ IFS అధికారి సుశాంత్ (Susanta Nanda IFS) నందా ఏనుగులు ట్రాక్ దాటేందుకు ఓ ర్యాంప్ ను ఏర్పాటు చేయడం ఉత్తమమని తెలిపారు. చెప్పడమే కాదు చేసి చూపించాడు కూడా. నందా ఏర్పాటు చేసిన ర్యాంప్ పైనే ఏనుగులు నడుస్తాయా అన్న అనుమానం అధికారులకు కలిగింది. అయితే ఈ ప్రయోగాన్ని చేసి చూడటంలో తప్పులేదనుకున్న ఆఫీసర్లు ర్యాంపును ఏర్పాటు చేసేందుకు అనుమతినిచ్చారు. అస్సాంలోని ఓ అటవీ ప్రాంతంలో రైలు పట్టాలకు ఇరువైపులా ర్యాంప్ ను ఏర్పాటు చేశాడు. ఏనుగులు రాకకోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అంతలోనే ఓ పెద్ద ఏనుగుల గుంపు అటువైపుగా నడుచుకుంటూ వచ్చింది.
మామూలుగా అయితే అన్ని ఏనుగులు తమ ఇష్టం వచ్చినట్లు రైలు పట్టాలను దాటుకుని వెళ్లేవి. కానీ తెలివిలో ఏనుగును మించిన జంతువు మరొకటి లేదని నిరూపించాయి. వాటిలో ఒకదానికి నున్నగా తీర్చిదిద్దిన ర్యాంప్ కనిపించింది. దాన్ని తీక్షణంగా చూసిన ఏనుగులు, నునుపుగా ఉన్న ర్యాంప్ గుండా వెళ్తే బాగుంటుందనుకున్నట్టున్నాయి. ఒకదాని వెనకాల మరొకటి నడుచుకుంటూ హాయిగా రైల్వే ట్రాక్ ను దాటేశాయి. అది చూసిన అధికారులు ఆనందం వ్యక్తం చేశారు.
An effective way to reduce elephant deaths on Railway tracks. Ramp for the gentle giants to cross the tracks is a much simpler way to reduce the conflict. Source:Assam FD pic.twitter.com/VZfwPjfwHG
అంటే, అలాంటి ర్యాంపులు అడవిలో వెళ్తున్న ట్రాక్ కు అక్కడక్కడా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఏనుగులు ఆ ర్యాంప్ పై వెళ్లేందుకు అటవాటు పడి మరో చోటునుంచి వెళ్లవు అని అధికారులు భావిస్తున్నారు. సదరు ర్యాంప్ వస్తుందనగా రైల్వే పైలట్లు కూడా రైలును మెళ్లిగా నడిపేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రయోగం కనుక మరింత సక్సెస్ అయితే ఏనుగులు ప్రశాంతంగా రైల్వే ట్రాక్ ను దాటేందుకు ఓ మార్గం దొరుకుతుంది.