Naga Chaitanya: అక్కినేని హీరో నాగచైతన్య (Naga Chaitanya) ఇటీవల కస్టడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బోల్తా కొట్టింది. దీంతో తదుపరి సినిమా విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయన ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా సంతకం చేసినట్లు తెలుస్తోంది.
బన్నీ వాస్ తన GA2 బ్యానర్‌పై ఈ ప్రాజెక్ట్‌ను బ్యాంక్రోల్ చేయనున్నారు. ఈ లోగా సినిమాలో నాగ చైతన్య (Naga Chaitanya) పాత్రపై ఊహాగానాలు సాగుతున్నాయి. నాగ చైతన్య (Naga Chaitanya) మత్స్యకారునిగా కనిపిస్తాడని, తన పడవలో చేపల వేటకు వెళ్లనున్నాడని ఇన్సైడ్ టాక్. ఆయన తన కెరీర్లో తొలిసారి ఇలా మత్స్యకారుడిగా కనిపిస్తుండటం విశేషం. ఫిషరీస్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన ఈ చిత్రం గుజరాత్లో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిందని తెలుస్తోంది. ఇప్పటి నుంచే ఈ మూవీపై ఆసక్తి మొదలైంది. విస్తృతంగా రీసెర్చ్ చేశామని, చందూ మొండేటి కథ చెప్పగానే నాగ చైతన్య చాలా ఎగ్జైట్ అయ్యాడని, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. త్వరలో ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.