KMR: పంచాయతీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నిన్నటితో తొలి విడత ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. KMR జిల్లాలో తొలి విడతలో 156 గ్రామాల్లో సర్పంచ్ పదవికి 727 మంది, 1084 వార్డులకు 3048 మంది పోటీ పడుతున్నారు. రెండో దశ ఎన్నికల ప్రచారం జోరందుకోగా.. మూడో విడతలో పోటీలో ఉన్న అభ్యర్థుల లెక్క తేలింది. మూడో విడతలో 168 పంచాయతీలకు గానూ 26 సర్పంచులు ఏకగ్రీవం అయ్యాయి.