HYD: GHMCని పరిపాలన సౌలభ్యం కోసం 300 వార్డులుగా విభజించారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని 300 వార్డులుగా విభజించినట్లు కమిషనర్ కర్ణన్ తెలిపారు. తెల్లాపూర్ వంటి ప్రాంతాల్లో ప్రస్తుతం తక్కువ జనాభా ఉన్నప్పటికీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని డీలిమిటేషన్ చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు,పార్టీల సభ్యులు 7 రోజుల్లోగా తమ అభ్యంతరాలు, సూచనలు తెలియజేయవచ్చన్నారు.