MBNR: బాలానగర్ మండలంలోని కేతిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఏడు ఎనిమిది వార్డులు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు మంగళవారం రాత్రి ప్రకటించారు. 7వ వార్డులో అలివేల, 8 వార్డులో యాదమ్మ ఒక్కొక్కరు చొప్పున నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ వార్డు పరిధిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.