VKB: జిల్లాలో గురువారం జరగనున్న మొదటి విడత ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్‌పై ఆయన సమీక్షించారు. మొదటి విడతలో భాగంగా ఉదయం పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.