SDPT: కుకునూరు పల్లి మండలంలో నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో అభ్యర్థులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేసినట్లు మండల ఎన్నికల అధికారి రాంప్రసాద్ తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు, డిసెంబర్ 10న ఉదయం 11 గంటలకు కోల అంజయ్య ఫంక్షన్ హాల్లో సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులకు ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఎన్నికల వ్యయంపై అవగాహన కల్పిస్తారు.