కోనసీమ: ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లిలో మంగళవారం ఆక్వాచెరువు వద్ద పనిచేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి వెంకట్రావు (38) అనే వ్యక్తి మృతి చెందాడు. చల్లపల్లిలోని పర్రపేటకు చెందిన వెంకట్రావు, ఎన్. కొత్తపల్లిలోని చెరువులో రసాయన మందు చల్లుతుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేష్ తెలిపారు.