CTR: జిల్లాలో దెబ్బతిన్న రోడ్లకు 76 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 71 పనుల ద్వారా 152,476 కిమీ రోడ్లకు మోక్షం కలగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 22 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. త్వరలో రోడ్ల పనులు ప్రారంభం కానున్నాయి.