NDL: శ్రీశైలం మండలం సున్నిపెంటలోని శ్రీ కుమార స్వామి దేవాలయంలో మంగళవారం స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు జరిగాయి. శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి భక్తులు పంచామృత అభిషేకం చేశారు. అనంతరం అర్చకులు భక్తులకు ఆశీర్వచనాలు అందించి, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.