VSP: కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ 15 నుంచి 26 వరకు విశాఖలో నిర్వహించనున్న జాతీయ స్థాయి సరస్ ఎగ్జిబిషన్–2025కు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సోమవారం ఆదేశించారు. డ్వాక్రా, స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆర్థిక బలోపేతం లక్ష్యంగా ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ కార్యక్రమం జరగనుంది.