KRNL: ఎమ్మిగనూరు మండలం కె. నాగలాపురంలోని మొక్కజొన్న, మిరప, వరి పంటలను ఎమ్మిగనూరు ఏడీఏ మహమ్మద్ ఖాద్రి, మండల వ్యవసయాధికారి శివశంకర్, వ్యవసాయ విస్తరణాధికారి నరసింహులు సోమవారం పరిశీలించారు. ముఖ్యంగా వరి పంట కోత, కంకి దశలో ఉందన్నారు. ఈ పంటకు మాని పండు తెగులు ఆశించిందని అన్నారు. దీని నివారణకు ప్రొవిజినల్ ఒక మిల్లీ లీటరు, ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేయాలన్నారు.