AKP: నక్కపల్లి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం పట్ల మండల టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం కోటవురట్ల మండలం జల్లూరులో పార్టీ టీడీపీ అధ్యక్షుడు లింగన్నాయుడు, పీఏసీఎస్ ఛైర్మన్ వేచలపు జనార్ధన్, రాజుపేట సర్పంచ్ బొడ్డేడి వెంకటరమణ, ఎంపీటీసీ ప్రకాష్ తదితరులు మాట్లాడుతూ.. డివిజన్ ఏర్పాటుకు కృషి చేసిన హోం మంత్రి అనితకు కృతజ్ఞతలు తెలిపారు.