అన్నమయ్య: ప్రజల అత్యవసర సమయాల్లో అండగా నిలబడి, ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రైల్వే కోడూరు MLA అరవ శ్రీధర్ స్పష్టం చేశారు. సోమవారం కోడూరు మండలం కుమ్మరపల్లిలో సీఎం సహాయనిధి కింద మంజూరైన 39,205 రూపాయల చెక్కును బాధితుడికి అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.