టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపై బీసీసీఐ కీలక వ్యాఖ్యలు చేసింది. దేశవాళీ టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీలో ఆడాలా? లేదా? అనేది ‘రో-కో’ వ్యక్తిగత నిర్ణయమని తెలిపింది. అంతేతప్ప, వారు ఖచ్చితంగా ఆడి తీరాల్సిందే అని వారికి ఎవరూ ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది. కాగా, ఈ టోర్నీలో ముంబై తరఫున రోహిత్, ఢిల్లీ జట్టుకు కోహ్లీ ఆడే అవకాశం ఉంది.