ఢిల్లీలో వాయు కాలుష్యం మరోసారి ప్రమాదకర స్థాయి చేరింది. ఈరోజు ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) సగటున 318 పాయింట్లు నమోదైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. గాలిలో దుమ్ము, ధూళి కణాలు పెరిగినట్లు తెలిపారు. దీంతో ఢిల్లీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కాలుష్య నియంత్రణ చర్యలు ముమ్మరం చేసింది.