TG: హైదరాబాద్లోని జవహర్నగర్ పీఎస్ పరిధిలో దారుణ హత్య జరిగింది. నడిరోడ్డుపై రియల్టర్ వెంకట రత్నంను దుండగులు కత్తులతో పొడిచి, తుపాకీతో కాల్చి చంపారు. ఘటనా స్థలంలో ఒక బుల్లెట్, కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.