హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో దర్శకుడు భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తోన్న మూవీ ‘స్వయంభు’. ఈ సినిమాలో నిఖిల్ ఎంట్రీ సీన్ అదిరిపోతుందట. ఓ రాజు పాత్ర పోషిస్తున్న నిఖిల్.. ఓ వార్ సీక్వెన్స్‌తో సినిమాలో ఎంట్రీ ఇస్తాడని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సీక్వెన్స్‌లోని విజువల్స్ నిజంగా అద్భుతంగా ఉంటాయని తెలిపాయి. ఇక ఈ సినిమా 2026 FEB 13న రిలీజ్ కానుంది.