JGL: నిరుపేదలకు సేవ చేయడం అభినందనీయమని, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 21 మంది నిరుపేదలకు ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కంటి అద్దాలు, మందులు పంపిణీ చేశారు. డాక్టర్ విజయ్, చెట్పల్లి సుధాకర్, జుంబర్తి శంకర్, రాజేశ్వర్ రెడ్డి, మహేష్ పాల్గొన్నారు.