కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ)గా అపూర్వ భరత్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో చింతూరు ఐటీడీఏ పీవోగా పనిచేసిన ఆయనను రాష్ట్ర ప్రభుత్వం ఈ పదవిలో నియమించింది. జిల్లా కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి జే. వెంకటరావు, ఏవో ఎస్. రామ్మోహన్ రావు సహా ఇతర అధికారులు ఆయనకు స్వాగతం పలికి, శుభాకాంక్షలు తెలియజేశారు.